Chinta Mohan : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మూడో ప్లేస్.. కాంగ్రెస్ పార్టీకి 130 స్థానాలు
అయోధ్య(Ayodhya) అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం సబబు కాదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్(Chinta Mohan) అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు సంతోషంగా లేరు. పేదలు, నిరుద్యోగులు నలిగిపోతున్నారని అన్నారు.
అయోధ్య(Ayodhya) అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం సబబు కాదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్(Chinta Mohan) అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు సంతోషంగా లేరు. పేదలు, నిరుద్యోగులు నలిగిపోతున్నారని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తనని చెప్పిన మోదీ(PM Modi).. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన మోదీ పట్టించుకోలేదన్నారు. పదేళ్ల పాలనలో బీజేపీ(BJP) ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిందన్నారు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో నల్ల ధనాన్ని వేస్తామని చెప్పి.. రూ. 15 రూపాయలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. నిన్న సంబరాలు జరుపుకున్నారు అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) పేరుతో.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) న్యాయం కొరకు, పేదల కోసం పాదయాత్ర చేస్తుంటే, అస్సాం(Assam) లో అడ్డుకోవడం దుర్మార్గం. ఇలాంటి పద్దతులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
అంగన్వాడీ మహిళలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం, అమానుషంగా ప్రవర్తించడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో(AP Elections 2024) జగన్(YS Jagan) పార్టీకి మూడో స్థానం.. టీడీపీ(TDP) కూటమికి రెండో స్థానం.. కాంగ్రెస్(Congress) పార్టీకి 130 అసెంబ్లీ స్థానాల్లో అఖండ విజయం తథ్యమన్నారు. ఎప్పుడూ లేని ఆవేదన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. మార్పు అనడం కంటే.. ప్రజల్లో పరివర్తన వచ్చిందన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం.. మా కాళ్ళను మేమే నరుక్కని, నష్టపోయామని, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టామని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కళ్లలో కన్నీళ్లు, ఆవేదన కనిపిస్తోందన్నారు. నవరత్నాలతో కూడొస్తదా.? గూడొస్తదా.? అని ప్రజలు అంతర్మధనం చెందుతున్నారని పేర్కొన్నారు.
మా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల(APCC President YS Sharmila)పైన ఈగవాలినా కాంగ్రెస్ పార్టీ సహించబోదన్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ వాయిస్ పెరిగిందన్నారు. షర్మిలారెడ్డిలో తన తండ్రి వైఎస్సార్, అన్న జగన్ కంటే సమయస్పూర్తి చాలా ఎక్కువ ఉంది. ఆమె వాయిస్ లో మెలోడీ వుంది. ప్రజలు ఆ గొంతును వినాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
కాపు, బలిజలు రిజర్వేషన్లు కొరకు పోరాటం చేసే స్థాయి నుంచి, ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. కాపు, బలిజలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇదే సరైన సమయం. మళ్ళీ ఇటువంటి అవకాశం రాదన్నారు.
చిరంజీవి(Chiranjeevi) మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ ,వైసీపీ వైపు కాపు, బలిజలు వెళ్తే ముఖ్యమంత్రులు కాలేరన్నారు. కాంగ్రెస్ తో కాపులు కలవండి. తప్పక ముఖ్యమంత్రులవుతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, సహా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు.