వైయ‌స్ఆర్‌(YSR) వాహన మిత్ర పథక ఐదో విడత ఆర్థిక సా­యాన్ని శుక్రవారం అందించారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో సీఎం జగన్‌(CM Jagan) బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉండేందుకు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు

వైయ‌స్ఆర్‌(YSR) వాహన మిత్ర పథక ఐదో విడత ఆర్థిక సా­యాన్ని శుక్రవారం అందించారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో సీఎం జగన్‌(CM Jagan) బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు అండగా ఉండేందుకు ఐదో విడత వాహన మిత్ర సాయం(Vahana Mithra sahayam) విడుదల చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదా­రులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేశామని అన్నారు. దీనితో కలిపి వైయ‌స్ఆర్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుందని.. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి రూ.50 వేల సాయం అందిచామని సీఎం జగన్ తెలిపారు. బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకమని తీసుకువచ్చామని, ఈ పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని సీఎం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు ఇన్స్యూరెన్స్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు కచ్చితంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు.

వాళ్లకి అధికారం కావాల్సింది పేదలను దోచుకోవటానికే..

ఈ ఎన్నికలకు కురుక్షేత్ర యుద్దం జరగబోతుందని.. ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వానికి.. నిరుపేదల వైపు నిలబడిన మ‌న ప్రభుత్వానికి యుద్ధం జరుగనుంద‌ని సీఎం పేర్కొన్నారు. మేనిఫేస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన మ‌న ప్ర‌భుత్వానికి.. ఎన్నికల మేనిఫేస్టోని చెత్తబుట్టలో వేసిన గత ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. వీళ్లకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేయటానికి కాదని.. అధికారంతో దోచుకుని, పంచుకుని తినటానికే అని సీఎం దుయ్యబట్టారు. గతంలోనూ ఇదే బడ్జెట్ ఉందని.. కానీ సీఎం మాత్రమే వేరని.. గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? అని సీఎం ప్రశ్నించారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుందని, వీళ్ల మాదిరి తనకు దత్తపుత్రుడు లేడని, ఎల్లో మీడియా లేదని చెప్పారు. తాను నమ్ముకున్నది దేవుడి దయను.. ఆతర్వత ప్రజల్నే నమ్ముకున్నాని సీఎం తెలిపారు.

Updated On 29 Sep 2023 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story