CM Jagan Appriciated SI : గుడ్ జాబ్.. ఎస్సైను అభినందించిన సీఎం
అల్లూరి సీతారామరాజు(Alluri Sitha Rama Raju) జిల్లా కూనవరంకు(Koonavaram) చెందిన పోలీసు అధికారిని సీఎం జగన్(CM Jagan) మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్(Rescue Operation) నిర్వహించిన కూనవరం ఎస్సై వెంకటేష్‌ను(SI Venkatesh) సీఎం జగన్ అభినందించారు.

Jagan Appriciated SI
అల్లూరి సీతారామరాజు(Alluri Sitha Rama Raju) జిల్లా కూనవరంకు(Koonavaram) చెందిన పోలీసు అధికారిని సీఎం జగన్(CM Jagan) మెచ్చుకున్నారు. ఈ సంవత్సరం వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్(Rescue Operation) నిర్వహించిన కూనవరం ఎస్సై వెంకటేష్‌ను(SI Venkatesh) సీఎం జగన్ అభినందించారు. హెలిపాడ్ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యే క్రమంలో సీఎం బస్సు దిగారు.
అదే సమయంలో అక్కడున్న స్థానికులు అధికారులు బాగా పనిచేశారని సీఎంకు చెప్పారు. స్థానిక ఎస్సై వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని వెల్లడించారు. గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని అక్కడున్న మహిళలు సీఎం ఎదుట ఎస్సైను మెచ్చుకున్నారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌ను సీఎం భుజం తట్టి అభినందించారు. వెంకటేష్‌కు మెడల్ ఇవ్వాలంటూ సీఎం జగన్ అధికారులకు సిఫార్సు చేశారు.
