నారా లోకేశ్ 226 రోజుల పాటు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అధ్యయనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడుతూ

Chief Chandrababu Fires On CM Jagan and YSRCP Govt
నారా లోకేశ్(Nara Lokesh) 226 రోజుల పాటు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అధ్యయనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. యువగళం-నవశకం(Yuvagalam Navasakam) సభలో ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ(YSRCP)పై నిప్పులు చెరిగారు. వైసీపీ రాజకీయ పార్టీకాదని, జగన్(CM Jagan) రాజకీయాలకు అనర్హుడన్నారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుందన్నారు. జగన్ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. దేశంలో ఎక్కడా జరగని ఘటనలు ఏపీలో జరుగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలన్నారు. గతంలో విశాఖ(Visakhapatnam) ఆర్థిక రాజధానిగా ఉండేదని.. ఇప్పుడు గంజాయికి క్యాపిటల్ గా మారిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారన్నారు. రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడారన్నారు. రుషికొండను బోడిగుండు కొట్టేశారన్నారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమంటూ చంద్రబాబు అన్నారు.
అమరావతి(Amaravathi) లేదా తిరుపతి(Tirupathi) సభలో ఉమ్మడి మేనిఫెస్టో(Manifesto) ప్రకటిస్తామన్నారు. టీడీపీ(TDP), జనసేన(Janasena) ప్రభుత్వంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, ఆడబిడ్డకు నెలకు రూ.1500 , తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తామన్నారు.
