Chevireddy Mohit Reddy : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు.. అతడిని ఆశీర్వదించండి..!
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని(Chevireddy Mohit Reddy) గెలిపించడానికి అందరూ శాయశక్తులా కృషి చేయండని టీటీడీ చైర్మన్(TTD Chairman), తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి(Bhumana Karunakara Reddy) పార్టీ శ్రేణులకు సూచించారు.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని(Chevireddy Mohit Reddy) గెలిపించడానికి అందరూ శాయశక్తులా కృషి చేయండని టీటీడీ చైర్మన్(TTD Chairman), తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి(Bhumana Karunakara Reddy) పార్టీ శ్రేణులకు సూచించారు. చంద్రగిరి నియోజకవర్గ(Chandragiri Constituency) ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..
మోహిత్ రెడ్డి చంద్రబాబు(Chandrababu) సొంత నియోజక వర్గంలో పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండని కోరారు. ఒక వైపు నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీ కొట్టు మిట్టాడుతోందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే వాళ్ల పార్టీ నుంచి చిన్న పోరాటం కూడా జరగలేదన్నారు. బంద్ కు పిలుపునిస్తే చంద్రబాబు ఇంటిలోని కారు కూడా నిలవలేదన్నారు.
తెలుగుదేశం పార్టీని ఎలా నడిపించాలో కూడా తెలియని, దిక్కు తోచని స్థితిలో ఆ పార్టీ ఉందని.. పైగా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ వాళ్లు గంటలు కొట్టి, డప్పులు వాయించడం,
చప్పుడు చేయడాన్ని చూస్తుంటే సంబరాలు చేసుకుంటున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సాధారణంగా విజయోత్సవాలు, సంబరాలు చేసుకునే సమయంలోనే ఇలాంటివి చేయడం జరుగుతుందన్నారు. ఎప్పుడూ వ్యవస్థలను మేనేజ్ చేయడంతో సరిపోవడం వల్లే ఈ దుస్థితి ఎదురవుతోందని అన్నారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అరెస్ట్ అయితే రాష్ట్ర మంతటా పోరాటాలు జరిగాయన్నారు. వైఎస్సార్ సీపీ(YSRCP) ఉద్యమాల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని తెలిసినా వైఎస్ జగన్ దేనికీ భయపడని దీరోధాత్తుడు అని కొనియాడారు. ఈ సారి ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి , నా తనయుడు అభినయ్ ఇద్దరూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.. గెలిపించండని శ్రేణులను కోరారు.