పులివర్తి నాని తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప.. శత్రువు కాదని

పులివర్తి నాని తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప.. శత్రువు కాదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో తాను ఒకరిపై చేయిచేసుకున్నట్టు కానీ, కనీసం చిన్న మాట తిట్టినట్టు కానీ చూపించగలరా.. ఇంతకంటే హుందాగా ఎలా ఉండాలో చెప్పాలన్నారు. కింది స్థాయి నుంచి వచ్చినవాడిని.. తనపై 88 కేసులు పెట్టారన్నారు చెవిరెడ్డి. చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు.. నేను అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునేవారా అని ప్రశ్నించారు చెవి రెడ్డి. మా పార్టీ కోసం, ప్రజల కోసం పోరాటాలు చేశానే తప్ప, టీడీపీ వాళ్లపైనా, వాళ్ల కుటుంబ సభ్యులపైనా ఏనాడూ దాడులు చేయలేదన్నారు. అక్రమాలు చేసుంటే చంద్రబాబు నన్ను వదిలిపెట్టేవారా? నన్ను బతకనిచ్చేవారా? అని ప్రశ్నించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

పులివర్తి నాని ప్రెస్ మీట్లు పెట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. ఎవరో ఒకరు తిడితే ఫర్వాలేదని ఒకరోజు భార్య తిడితే, మరొకరోజు భర్త తిడతాడు, ఇంకొక రోజు కొడుకు తిడతాడన్నారు చెవి రెడ్డి. నాని భార్య నన్ను వాడు, రాస్కెల్, వెధవ, బుద్ధుందా అని మాట్లాడుతుంటే నేను ఏమనాలి? నేను ఎందుకు భరించాలి? నా జీవితంలో ఎప్పుడూ ఆడమనిషిపై వ్యాఖ్యలు చేయలేదు. చదువుకునే రోజుల్లో కూడా మహిళలపై అనుచితంగా మాట్లాడలేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

Updated On 25 May 2024 8:05 AM GMT
Yagnik

Yagnik

Next Story