కాకినాడలో(Kakinada) పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబసభ్యులతో ఆనందంగా గడిచిన హారిక(Harika) మరొక్క రోజు అక్కడే ఉండి ఉంటే ప్రాణాలు మిగిలేవి

కాకినాడలో(Kakinada) పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబసభ్యులతో ఆనందంగా గడిచిన హారిక(Harika) మరొక్క రోజు అక్కడే ఉండి ఉంటే ప్రాణాలు మిగిలేవి. అమ్మకు కడుపుకోత మిగిలేది. అనకాపల్లి(ankapally) జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ(Pharma company) రియాక్టర్‌ పేలిన ఘటనలో 22 ఏళ్ల చర్లపల్లి హారిక కూడా కన్నుమూసింది. కడు పేదరికంలో పుట్టిన హారిక చదువులో చాలా చురుకు. ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన హారిక ఎనిమిది నెలల కిందట ఫార్మా కంపెనీలో కెమికల్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన హారిక తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది. సోదరుడు చిన్నప్పుడే ఇల్లు వదిలివెళ్లిపోయాడు. రాఖీ పండుగ సందర్భంలో హారిక కాకినాడకు వచ్చింది. పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపింది. మరో రోజు కూడా తమతో ఉండాల్సిందిగా వారు బతిమాలారు. తనకు సెలవు లేదని, వెళ్లి తీరాలని చెప్పి అచ్యుతాపురానికి వచ్చింది. కంపెనీ ల్యాబ్‌కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్‌ పేలింది. భవన శిథిలాలలో చిక్కుకుని హారిక చనిపోయింది.



Eha Tv

Eha Tv

Next Story