సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు(Janasena) పాతిక నుంచి 30 సీట్లు ఇస్తే అది విఫల ప్రయోగమేనని చెప్పారు. తెలుగుదేశంపార్టీ(TDP)- జనసేన పార్టీల పొత్తులపై తన విశ్లేషణ చెబుతూ ఓ బహిరంగ లేఖ(Letter) రాశారు. జనసేనకు టీడీపీ తక్కువ సీట్లను ఇవ్వాలని చూస్తుందని లేఖలో ఫైరయ్యారు హరిరామజోగయ్య.

సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు(Janasena) పాతిక నుంచి 30 సీట్లు ఇస్తే అది విఫల ప్రయోగమేనని చెప్పారు. తెలుగుదేశంపార్టీ(TDP)- జనసేన పార్టీల పొత్తులపై తన విశ్లేషణ చెబుతూ ఓ బహిరంగ లేఖ(Letter) రాశారు. జనసేనకు టీడీపీ తక్కువ సీట్లను ఇవ్వాలని చూస్తుందని లేఖలో ఫైరయ్యారు హరిరామజోగయ్య. జనసేన ఎదుగుదలకు టీడీపీనే అడ్డంకి అని అన్నారు. యాభై అసెంబ్లీ స్థానాలు, ఆరు లోక్‌సభ స్థానాలను జనసేనకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్‌ చేశారు. సర్దుబాటులో టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 2019లో పోటీ చేసి ఓడిపోయిన అనేకమంది జనసేన నాయకులు 2024 లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తున్నదని, పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే జనసేన క్యాడర్‌ ఊరుకోబోదని తెలిపారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్ల కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావాహులను నిరాశ నిస్పృహలకు లోను చేస్తున్నాయని లేఖలో వివరించారు హరిరామజోగయ్య.

Updated On 27 Jan 2024 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story