Chegondi Harirama Jogaiah : చేగొండి హరిరామ జోగయ్య తాజా లేఖ చూశారా?
మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్యకు సంబంధించిన మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య రాసిన లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని అన్నారు.

మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్యకు సంబంధించిన మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య రాసిన లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని అన్నారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు.
అసెంబ్లీ సీట్లు జనసేన, తెలుగుదేశం మధ్య జనాభాల నిష్పత్తిలో జరగబోతున్నాయా? బడుగు బలహీనవర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కతోతోందా? సామాజిక న్యాయం జరగబోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
