తిరుమ‌ల‌ నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడుపై చిరుత దాడి చేసింది. బాలుడిని చిరుత ఎత్తుకెళ్తుండ‌గా.. సమీపంలో విధుల‌లో వున్న పోలీసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళింది. ఈ ఘ‌ట‌న‌లో భాలుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌ పాలైన బాలుడిని పోలీసులు పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు.

తిరుమ‌ల‌ నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడుపై చిరుత దాడి చేసింది. బాలుడిని చిరుత ఎత్తుకెళ్తుండ‌గా.. సమీపంలో విధుల‌లో వున్న పోలీసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళింది. ఈ ఘ‌ట‌న‌లో భాలుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌ పాలైన బాలుడిని పోలీసులు పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

గత రాత్రి కుటుంబీకులతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న క్ర‌మంలో మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడికి పాల్ప‌డింది. కౌశిక్ ను నోట కరచుకొని అడవిలోకి ఎత్తుకెళ్లేందుకు చిరుత పులి యత్నించింది. నడక మార్గం నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు బాబును లాక్కెళ్లింది చిరుత.. కుటుంబీకులు, స్థానికులు, పోలీసులు కేకలు పెట్టడంతో బాబును వదిలి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత. ఈ ఘ‌ట‌న‌లో కౌశిక్ చెవి వెనుక, మెడ, తల వద్ద గాయాలయ్యాయి. కౌశిక్ కు ఎంఆర్ఐ స్కాన్ చేసి.. బలమైన గాయాలు కావని నిర్ధారణకు వ‌చ్చిన వైద్యబృందం.. ప్రాణాపాయం లేదని తేల్చింది. అయితే. కౌశిక్ పై దాడి చేసింది చిరుత కూనగా గుర్తించారు అధికారులు. చిరుతకు ఏడాదిలోపే వయసు ఉంటుందని అటవీ సిబ్బంది భావిస్తుంది. ఘటన జరిగిన నడక మార్గం ఏడవ మైలురాయి వద్ద అదనపు భ‌ద్ర‌త‌ను ఏర్పాటుచేశారు అధికారులు.

Updated On 22 Jun 2023 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story