ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎలాగైనా సరే జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) దించేయాలనే ఏకైక ఉద్దేశంతో ఒక్కటయ్యి జట్టు కట్టాయి తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP)! కూటమి కట్టాయి కానీ సీట్ల సర్దుబాటులో నానా తిప్పలు పడ్డాయి. ఇప్పటికీ ఎవరికే సీటు అన్న విషయంలో స్పష్టత లేదు. టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల మార్పు ఉండవచ్చన్నది లేటెస్ట్‌ టాక్‌! పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, అదే జిల్లాలో ఉన్న నరసాపురం లోక్‌సభ అభ్యర్థి, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తారనే మాట మూడు రోజుల నుంచి వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎలాగైనా సరే జగన్మోహన్‌రెడ్డిని(CM Jagan) దించేయాలనే ఏకైక ఉద్దేశంతో ఒక్కటయ్యి జట్టు కట్టాయి తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP)! కూటమి కట్టాయి కానీ సీట్ల సర్దుబాటులో నానా తిప్పలు పడ్డాయి. ఇప్పటికీ ఎవరికే సీటు అన్న విషయంలో స్పష్టత లేదు. టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల మార్పు ఉండవచ్చన్నది లేటెస్ట్‌ టాక్‌! పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే, అదే జిల్లాలో ఉన్న నరసాపురం లోక్‌సభ అభ్యర్థి, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తారనే మాట మూడు రోజుల నుంచి వినిపిస్తోంది. సమస్య అంతా నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు నుంచే వచ్చింది. ఆయన ఎప్పుడైతే తెలుగుదేశంపార్టీలో చేరారో అప్పటి నుంచే కూటమిలో కొట్లాట మొదలయ్యింది. తనకు నరసాపురం లోక్‌సభ సీటే కావాలని పేచిపెడుతున్నారు రఘురామకృష్ణరాజు. నిజానికి ఆ సీటును బీజేపీ పెద్దమనుసుతో తనకు ఇస్తుందని గట్టిగా నమ్మారు రఘురామకృష్ణరాజు. బీజేపీలో కనీసం సభ్యుడినైనా కాని తనకు ఎలా టికెట్‌ ఇస్తుందని రఘురామకృష్ణ అనుకోలేదు. ఈయనను బీజేపీ కొంచెం కూడా పట్టించుకోలేదు.

మూడు దశాబ్దాలుగా క్రీయాశీలక కార్యకర్తగా బీజేపీకి సేవలందిస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్‌ ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. రఘురామకృష్ణరాజు బిత్తరపోయారు. బీజేపీ వదిలేసుకుంటే తనకు టీడీపీ ఉందిగా అని అనుకున్నారు. నిజానికి రఘురామకృష్ణరాజుకు ఏదో ఒక సీటు కేటాయించాల్సిన బాధ్యత టీడీపీదే! ఎందుకంటే ఈయనను ఆ పార్టీ అంతగా వాడుకుంది కాబట్టి! నమ్మినవారిని నట్టేట ముంచే తన సహజ స్వభావానికి భిన్నంగా రఘురామకృష్ణరాజును పార్టీలో చేర్చుకుని ఉండి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఉండిలో అలజడి మొదలయ్యింది. ఇప్పటికే తనకు టికెట్ దక్కలేదని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. మాట్లాడుకుందాం రమ్మని చంద్రబాబు కబురుపెట్టినా శివరామరాజు వెళ్లలేదు. ఈ సమస్య నలుగుతున్నప్పుడే చంద్రబాబు కారణంగా కొత్త సమస్య అక్కడ పుట్టుకొచ్చింది. రఘురామకృష్ణరాజుకు టికెట్‌ ఇస్తే తాను కూడా స్వతంత్రంగా పోటీకి దిగుతానని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అల్టిమేటం ఇచ్చారు. అలాగే అనపర్తి సీటును భారతీయ జనతా పార్టీకి ఇవ్వడంతో ఇప్పటికే అక్కడ ప్రకటించిన తెలుగుదేశంపార్టీ అభ్యర్థి న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి తనకు న్యాయం కావాలంటూ రోడ్డు మీదకు వచ్చారు. ఆందోళన చేస్తున్నారు. ఈ సీటును బీజేపీకి ఇవ్వకుండా టీడీపీకే ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే న‌ర‌సాపురం లోక్‌సభ స్థానాన్ని టీడీపీకి ఇస్తే, ఏలూరు లోక్‌స‌భ స్థానాన్ని బీజేపీకి ఇస్తామ‌ని చంద్రబాబు చెప్పారట! అలాగే ఉండి స్థానంలో న‌ర‌సాపురం బీజేపీ అభ్య‌ర్థి శ్రీ‌నివాస్ వ‌ర్మ‌ను పోటీ చేయిస్తామ‌ని చంద్రబాబు మాట ఇచ్చారట! ఏం జరుగుతుందో ఏమో!!

Updated On 16 April 2024 3:51 AM GMT
Ehatv

Ehatv

Next Story