భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిషన్ చంద్రయాన్-3 శుక్రవారం ప్రయోగానికి సిద్ధంగా ఉంది. చంద్రయాన్-3 కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్-III (LVM-III) నుండి ఇది ప్రయోగించబడుతుంది. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడమే చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిషన్ చంద్రయాన్-3(Chandrayaan-3) శుక్రవారం ప్రయోగానికి సిద్ధంగా ఉంది. చంద్రయాన్-3 కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్-III (LVM-III) నుండి ఇది ప్రయోగించబడుతుంది. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడమే చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం. ఇది భారత్(India) యొక్క మూడవ చంద్రయాన్‌ మిషన్ కాగా.. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇది రెండవ ప్రయత్నం. ఇంతకు ముందు అమెరికా(America), రష్యా(Russia), చైనా(China) అనే మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి.

చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయిన నాలుగు సంవత్సరాల తర్వాత భారత్‌ ఈ మిషన్ కు పూర్తిస్థాయిలో సన్న‌ద్ధ‌మైంది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైతే.. అది అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన మరో అతిపెద్ద విజయం అవుతుంది. జులై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Centre) నుంచి మిషన్ టేకాఫ్ అవుతుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందన్నారు.

చంద్రయాన్-3 అనేది చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధించడానికి పనిచేస్తుంది. ఈ ప్రదేశంలో ఎక్కువ భాగం చీకటిగా ఉంటుంది. 3,921 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం దాదాపు 4,00,000 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రాకెట్(Rocket) బరువు 642 టన్నులు, ఇది దాదాపు 130 ఆసియా ఏనుగుల బరువుకు సమానం. దీని ఎత్తు 43.5 మీటర్లు.

చంద్రయాన్-3 మిషన్.. చంద్రయాన్-2 తదుపరి దశ.. ఇది చంద్రుని ఉపరితలంపై దిగి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్ చేయడంపై చంద్రయాన్-3 దృష్టి సారించింది. మిషన్ విజయవంతానికి కొత్త పరికరాలు, అల్గారిథమ్‌లు మెరుగుపరచబడ్డాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 మిషన్ ల్యాండ్ కాలేకపోవడానికి గల కారణాలపై దృష్టి సారించారు.

Updated On 13 July 2023 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story