Chandrababu Health : చంద్రబాబుకు బీపీ, డయాబెటిస్ కూడా ఉంది
చంద్రబాబును అరెస్ట్(Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని లాయర్ రామ చంద్రరావు(Lawyer Ram chandra Rao) తెలిపారు. ఆయనకు బీపీ(BP) ఎక్కువగా ఉందని.. ఆయనకు డయాబెటిస్ కూడా ఉందని తెలిపారు. వైద్యపరీక్షల తరువాత సీఐడీ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు ముందు 6 గంటలపాటు నంద్యాలలో(Nandhyala) హైడ్రామా నడిచింది.
చంద్రబాబును అరెస్ట్(Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని లాయర్ రామ చంద్రరావు(Lawyer Ram chandra Rao) తెలిపారు. ఆయనకు బీపీ(BP) ఎక్కువగా ఉందని.. ఆయనకు డయాబెటిస్ కూడా ఉందని తెలిపారు. వైద్యపరీక్షల తరువాత సీఐడీ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు ముందు 6 గంటలపాటు నంద్యాలలో(Nandhyala) హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటలనుంచే అటు టీడీపీ(TDP) శ్రేణులు అప్రమత్తంగా ఉన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా పోలీసులు, సీఐడీ(CID) అధికారులు పెద్ద ఎత్తున చంద్రబాబు బస చేసిన చోటికి వెళ్లారు. పక్కా ప్రణాళిక ప్రకారం సీఐడీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు బస్సు తలుపుల కొట్టారు. ఆ తరువాత బస చేసిన బస్సు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కిందకు దిగారు. ఆయనను చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.