Chandrababu Custody Petiton Case : కొనసాగుతున్న టెన్షన్.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా
చంద్రబాబు(Chandrabau) కస్టడీ పిటిషన్‌పై(Custody petittion) తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court) మరోసారి వాయిదా వేసింది. కోర్టు తీర్పును రేపు ఉదయం 10.30 గంటలకు వెలువరించనున్నట్లు ప్రకటించింది. బుధవారం నాడు.. గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని చెప్పిన ధర్మాసనం..

custody petition
చంద్రబాబు(Chandrababu) కస్టడీ పిటిషన్‌పై(Custody petittion) తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court) మరోసారి వాయిదా వేసింది. కోర్టు తీర్పును రేపు ఉదయం 10.30 గంటలకు వెలువరించనున్నట్లు ప్రకటించింది. బుధవారం నాడు.. గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని చెప్పిన ధర్మాసనం.. ఈ రోజు ఉదయం.. సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇస్తామని వాయిదా వేసింది. తాజాగా మరోమారు తీర్పు రేపటికి వాయిదా వేయటంతో చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై టెన్షన్ కొనసాగుతుంది.
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో(Skill development Case) రాజమండ్రి జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపటితో ఆయన రిమాండ్ కూడా పూర్తి కానుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నిన్నంతా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈరోజుకు తీర్పు చెబుతారని భావించినా.. రేపటికి వాయిదా పడటంతో టెన్షన్ కొనసాగుతుంది.
