ఈనాడు(eenadu) దినపత్రిక రోజురోజుకీ దిగజారిపోతోంది. తెలుగుదేశంపార్టీలాగే(TDP), ఈనాడుకు కూడా దింపుడుకళ్లెం ఆశలా ల్యాండ్ టైట్లింగ్ కనిపిస్తోంది. ఎన్నికలకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో టీడీపీ, ఈనాడు పూర్తిగా దిగజారిపోయాయి. ల్యాండ్ టైట్లింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పూస గుచ్చినట్టు, అందరికీ అర్థమయ్యేట్టు వివరంగా చెప్పారు ఓ ఇంటర్వ్యూలో! ల్యాండ్ టైట్లింగ్ చట్టం కారణంగా ఎవరూ భూములు కోల్పోరని, పైగా అందరికీ మంచే జరుగుతుందని జగన్ చెప్పారు. ఇది జనాలకు కనెక్ట్ అయ్యింది. జగన్ (Jagan)వివరణతో జనం సంతృప్తి చెందారు.
ఈనాడు(eenadu) దినపత్రిక రోజురోజుకీ దిగజారిపోతోంది. తెలుగుదేశంపార్టీలాగే(TDP), ఈనాడుకు కూడా దింపుడుకళ్లెం ఆశలా ల్యాండ్ టైట్లింగ్ కనిపిస్తోంది. ఎన్నికలకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో టీడీపీ, ఈనాడు పూర్తిగా దిగజారిపోయాయి. ల్యాండ్ టైట్లింగ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పూస గుచ్చినట్టు, అందరికీ అర్థమయ్యేట్టు వివరంగా చెప్పారు ఓ ఇంటర్వ్యూలో! ల్యాండ్ టైట్లింగ్ చట్టం కారణంగా ఎవరూ భూములు కోల్పోరని, పైగా అందరికీ మంచే జరుగుతుందని జగన్ చెప్పారు. ఇది జనాలకు కనెక్ట్ అయ్యింది. జగన్ (Jagan)వివరణతో జనం సంతృప్తి చెందారు. అప్పటి వరకు వారిలో ఉన్న అపోహలు మటుమాయం అయ్యాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ తర్వాత అందరికీ ఒరిజినల్ డ్యాకుమెంట్లే అందుతున్నాయి. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇదేమీ జగన్ గొప్పతనం కాదని, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో అమలులో ఉందని నిండు అసెంబ్లీలో టీడీపీ నాయకుడు మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్‌ను మెచ్చుకున్నారు. దానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కానీ టీడీపీ అధినేత మాత్రం నానా యాగి చేస్తున్నారు. జగన్ భూములను కొల్లగొట్టడానికే ఈ చట్టం తీసుకువచ్చాడని పచ్చిగా అబద్ధాలు అడతారు. ఇక చంద్రబాబును(chandrababu) భజన చేసే పత్రికలు పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తుంటాయి. అందులో ఏ ఒక్కటి నిజం ఉండదు. అన్నీ అవాస్తవాలే! అన్నట్టు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు నాలుగు నెలల కిందట ఇదే చట్టంపై ఓ కథనం ప్రసారం చేసింది. అందులో ఇంతకంటే గొప్ప చటం మరోటి ఉండదని, రైతులకు ఇదో వరమని చెప్పింది. ప్రజలు నవ్వుకుంటారనే భయంతో, తమ పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో వెంటనే ఆ స్టోరీని యూ ట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. అప్పటికే అది అందరికీ చేరిపోయింది. ఇవాళ అదే ఈనాడు తన మొదటి పేజీని ల్యాండ్ టైట్లింగ్(Land Titiling) యాడ్‌కు కేటాయించింది. మీ భూమి మీది కాదు అన్న శీర్షికను పెట్టి ప్రజలు భయపడేలా రాతలు రాసింది ఆ రోత పేపర్. ఆ యాడ్ ఇచ్చింది కూటమి. మరి అందులో మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు. పెట్టే ధైర్యం లేక. ఎందుకంటే ఆ చట్టం తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం కాబట్టి. మోదీని అనే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదు కాబట్టి ఆ పని చేయలేదు. నీతిఆయోగ్(NITI Ayog) సిఫార్సులతోనే కేంద్రం ఈ చట్టం తెచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఏపీ బీజేపీ(BJP) శాఖకు మాత్రం తెలియదు. తెలిసినా తెలియనట్టు నటిస్తోంది. ఇలా అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వకూడదని టీడీపీకి చెప్పాలి కదా! ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు ఏనాడు నిజం చెప్పరన్న సంగతి తెలుసుకానీ, ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారని మాత్రం తెలియదు. చంద్రబాబు చెబుతున్న కట్టు కథలను ఈనాడు ప్రచురించడం మరో వింత! ఈనాడు కూడా ఎప్పుడు నిజం చెప్పిందని! ఆ పత్రిక పుట్టుకే అసత్యాల పునాదుల మీద కదా! డబ్బులిస్తే ఎంత నీచానికైనా ఈనాడు దిగజారుతుంది. చెప్పుకోవాలంటే మేనిఫెస్టో గురించి చెప్పుకోవచ్చు కదా!