Chandrababu : చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారా? ఫలితాల తర్వాత ఏం చేయబోతున్నారు?
మరో అయిదు రోజులు..కోట్లాది భారతీయుల ఉత్కంఠకు తెరపడే రోజు దగ్గరకొచ్చేసింది. మంగళవారం సాయంత్రానికి విజేతలెవరో పరాజితులెవరో క్లారిటీ వచ్చేస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని భారతీయ జనతాపార్టీ(BJP) చెప్పుకుంటోంది.
మరో అయిదు రోజులు..కోట్లాది భారతీయుల ఉత్కంఠకు తెరపడే రోజు దగ్గరకొచ్చేసింది. మంగళవారం సాయంత్రానికి విజేతలెవరో పరాజితులెవరో క్లారిటీ వచ్చేస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని భారతీయ జనతాపార్టీ(BJP) చెప్పుకుంటోంది. అంత సీన్ లేదని, ఇండియా బ్లాక్ గరిష్ట స్థానాలు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్(Congress) అంటోంది. కూటములు రెండూ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నాయి. అయితే ఎన్డీయే కూటమి(NDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడనన్ని స్థానాలు సాధించలేకపోతే అప్పడేమిటి పరిస్థితి? అప్పుడు నాగపూర్ బ్యాచ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. నరేంద్రమోదీ(Narendramodi)ని కాదని తమకు అనుకూలంగా ఉన్న నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నితిన్ గడ్కరీ అయితే ప్రస్తుతం రెండు కూటములకు దూరంగా ఉన్న కొన్ని పార్టీలు ఎన్డీయేకు మద్దతు ఇవ్వవచ్చు. బిజూ జనతాదళ్(Biju Janata Dal), బీఆర్‌ఎస్(BRS) వంటి పార్టీలతో ఎన్డీయే బేరం పెట్టుకోవచ్చు. మరి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఏం చేస్తారు? అంటే ఎక్కడికి వెళితే పార్టీ భవిష్యత్తుతో పాటు, వ్యక్తిగత భవిష్యత్తు కూడా బాగుంటుందో ఆ వైపుకు నిర్మోహమాటంగా వెళతారు. కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్(Jairam Ramesh) చెప్పింది కూడా ఇదే! ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్క్లూజివ్ అలెయెన్స్(ఇండియా) 272కు పైగా స్థానాలు గెల్చుకుంటుందని ధీమాగా చెప్పారు. ప్రజా తీర్పు ఇండియా పక్షాన వస్తే మాత్రం ఎన్డీయే పార్టీలు కూడా సంకీర్ణంలో చేరతాయని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి ఆహ్వానం పలకదని ఆయన చెప్పుకొచ్చారు. నితీశ్ కుమార్(Nitish Kumar), నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) వంటి వారిని చేర్చుకుంటారా? అని ఓ విలేకరి అడితే నితీశ్ కుమార్ పార్టీలు మార్చడంలో మాస్టర్ అంటూ చంద్రబాబు కూడా 2018లో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జై రామ్ రమేశ్ అన్నారని కాదు కానీ, ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తే మాత్రం చంద్రబాబు ఎన్డీయేకు గుడ్ చెప్పేసి ఇండియా కూటమిలో చేరతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 1998లో చంద్రబాబు ఏం చేశారో ఇప్పుడూ అదే చేస్తారని చెప్పారు. 1998లో యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు ఆ ఫ్రంట్ అధికారంలోకి రావడం కల్ల అని తెలియగానే రాత్రికి రాత్రే యునైటెడ్ ఫ్రంట్‌ను వదిలిపెట్టి ఎన్డీయేకు జై కొట్టారు. ఎన్డీయే కూటమిలో చేరారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమిలోనే చంద్రబాబు ఉన్నా కాంగ్రెస్‌తో కూడా టచ్‌లో ఉన్నారట! ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి కాంగ్రెస్‌లో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారని వినికిడి. టీడీపీ ఆరేడు లోక్‌సభ స్థానాలు గెల్చుకుంటే, వాటితో ఢిల్లోలో చక్రం తిప్పవచ్చని ఆరాటపడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ లేదు. ఎప్పటికైనా ఎన్డీయేను విడిచిపెట్టే వ్యక్తిగా భావిస్తోంది. చంద్రబాబు ఎన్టీయేను వదిలిపెట్టి కాంగ్రెస్ కూటమిలో చేరితే మాత్రం దాన్ని చాలా కన్వీనియెంట్‌గా సమర్థించుకోగలరు. రాష్ట్రాభివృద్ధి కోసమే చంద్రబాబు ఇండియా కూటమిలో చేరాల్సి వచ్చిందని టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసినా రాస్తుంది. మొత్తం మీద చంద్రబాబు అటో కాలు ఇటో కాలు వేసి ఉన్నారు. ఎన్టీయేలోనే ఉంటారా? ఇండియా కూటమిలోకి వస్తారా అన్నది త్వరలో తేలిపోతుంది.