Chandrababu : నేడు కోనసీమ, అరకులో చంద్రబాబు 'రా కదలి రా' సభలు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తూ రా కదలి రా పేరుతో బహిరంగ సభలలో పాల్గొంటున్నారు.

Chandrababu to hold Ra Kadali Ra meetings in Konaseema and Araku today
ఎన్నికల(Elections)కు సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Cheif Chandrababu) వరుస పర్యటనలు చేస్తూ రా కదలి రా(RA Kadali Ra) పేరుతో బహిరంగ సభల(Public Meetings)లో పాల్గొంటున్నారు. రా కదలి రా లో భాగంగా శనివారం కోనసీమ(Konaseema) జిల్లా అమలాపురం(Amalapuram) లోక్‌సభ నియోజకవర్గ పరిధి మండపేటలో జరిగే భారీ బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాన్ని తరలిచేందుకు టీడీపీ(TDP, జనసేన(Janasena) నేతలు కసరత్తులు చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఇది 11వ బహిరంగ సభ. ఈ సభలో కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే చంద్రబాబు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) అరకు(Araku)లో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
