Chandrababu Shock To Ravi Prakash : రవిప్రకాశ్‌కు చంద్రబాబు షాక్!
టీవీ 9(Tv9) మాజీ సీఈవో, ఆర్‌టీవీ(RTV) అధినేత రవిప్రకాశ్‌కు(Ravi Prakash) ఇది షాకిచ్చే వార్తనే!
టీవీ 9(Tv9) మాజీ సీఈవో, ఆర్‌టీవీ(RTV) అధినేత రవిప్రకాశ్‌కు(Ravi Prakash) ఇది షాకిచ్చే వార్తనే! టీవీ9 తనకు కాకుండా చేసిన మేఘా కృష్ణారెడ్డిపై పగను పెంచుకున్న రవిప్రకాశ్ ఆయన అంతు చూడాలనే అనుకుంటున్నారు. ఆర్‌టీవీలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అవినీతిని ఎండగడుతున్నారు. కంపెనీ నిర్మాణాల్లోని డొల్లతనంపై రోజుకో వార్తను ప్రసారం చేస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్‌పై విశ్లేషణాత్మక కథనాలను స్వయంగా రవిప్రకాశే తెరమీదకు వచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ చేసిన 2500 కోట్ల రూపాయల స్కామ్(2500 crores scam) అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేశారు. నకిలీ బ్యాంక్ గ్యారంటీ స్కామ్‌లో(bank gaurantee scam) బయటపడిన మేఘా మోసమని చెప్పారు. మొత్తం కుంభకోణంలో ఇదో చిన్న భాగం మాత్రమేనని, దీని వెనుక ఇంకా ఎంత పెద్ద స్కామ్ ఉందో తమకు కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు రవిప్రకాశ్ . హర్షద్ మెహతా స్కామ్(Harshad mehat scam) కంటే ఇదే పెద్ద స్కామ్ అన్నారు. ఎక్కడో సెయింట్ లూయిస్‌లో ఉన్న బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీతో మేఘా సంస్థ కోట్లకు కోట్లు దోచేస్తున్నదని రవిప్రకాశ్ ఆరోపించారు. 2500 కోట్ల రూపాయల కుంభకోణంతో పాటు ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులలోని డొల్లతనాన్ని కూడా ఎండగట్టారు రవిప్రకాశ్. కాళేశ్వరం పంప్ హౌస్ నీటమునగడంరిటైనింగ్ వాల్స్ కూలిపోవడం, వంతెనల్లో ప్రమాదాలు జరగడం .. ఇలా ప్రతి విషయాన్ని రవిప్రకాశ్ తనదైన స్టయిల్లో ప్రజెంట్ చేస్తున్నారు. మేఘాపై అంతటి కసిని పెంచుకున్న రవిప్రకాశ్ మేఘా పతనాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(tdp) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేఘా అంతు తేలుస్తారన్న ఆశతో ఉన్నారు. అందుకే ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు రవిప్రకాశ్.. పోలవరం ప్రాజెక్టు దరిదాపుల్లోకి మేఘాను రానివ్వరని, ఆ కాంట్రాక్టు మరో సంస్థకు అప్పచెబుతారని రవిప్రకాశ్ అనుకున్నారు. రవిప్రకాశ్‌తో పాటు ఈనాడు కూడా అదే భావనతో ఉండింది. జగన్మోహన్‌రెడ్డి(YS jagan) అధికారంలోకి రాకమునుపు పోలవరం నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థ చూసుకుంది. ఈ నవయుగ అధినేత రామోజీరావు(Ramoji rao) దగ్గర బంధువన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి రాగానే పోలవరంపై దృష్టి పెట్టారు. రివ్యూ మీటింగ్‌లు పెట్టారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్‌ను కూడా మారుస్తారని అనుకున్న వారికి షాకిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు మేఘా సంస్థకే అప్పగించనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థకే ఆ పనులు కూడా అప్పగించడం మంచిదని కేంద్రమంత్రి పాటిల్(Central minister patil) సూచించారు. కేంద్రమంత్రి సూచనను కాదంటే బాగోదని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. ప్రభుత్వాలపై ఎలాంటి భారం పడకపోవడంతో పాత కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయట!
ఇప్పుడు కూడా రవిప్రకాశ్ మేఘా ఇంజనీరింగ్‌పై వ్యతిరేక వార్తలు రాస్తారా? ఒకవేళ రాస్తే చంద్రబాబుకు ఇబ్బంది కలుగుతుంది. రాయకపోతే రవిప్రకాశ్‌పై అనుమానాలు వస్తాయి. మొత్తంగా రవిప్రకాశ్‌ను చంద్రబాబు ఇరుకునపడేశారు