వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడెప్పుడు చంద్రబాబు(Chandrababu)కు అధికారం అప్పగిద్దామా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా చెబుతుంటుంది. అయితే ఇంత సానుకూలత ఉన్నప్పుడు పొత్తుల(Alliance) కోసం చంద్రబాబు ప్రయత్నించడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడెప్పుడు చంద్రబాబు(Chandrababu)కు అధికారం అప్పగిద్దామా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా చెబుతుంటుంది. అయితే ఇంత సానుకూలత ఉన్నప్పుడు పొత్తుల(Alliance) కోసం చంద్రబాబు ప్రయత్నించడం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఒంటరిగా ఓడించడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు ముందు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)తో చేతులు కలిపారు. అయినా బలం సరిపోవడం లేదని గ్రహించి బీజేపీ(BJP)ని కూడా కలుపుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తన అరెస్ట్‌లో బీజేపీ పెద్దల హస్తం ఉందని తెలిసి కూడా ఆ పార్టీతో చెలిమికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీనే పొత్తు కోసం తాపత్రయపడుతున్నదో, చంద్రబాబే కలిసి పోటీ చేద్దామని కమలనాథులను రిక్వెస్ట్‌ చేస్తున్నారో తెలియదు కానీ పొత్తు అయితే కుదిరిందని అంటున్నారు. కాకపోతే కమలనాథుడు పెట్టిన డిమాండ్లు చూసి చంద్రబాబునాయుడు బిత్తరపోయారట! బీజేపీ పెట్టిన మెలికతో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారట! ప్రతి లోక్‌సభ పరిధిలో తెలుగుదేశంపార్టీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని, జనసేన రెండు స్థానాలలో, బీజేపీ ఒక స్థానం నుంచి పోటీ చేయాలని బీజేపీ పెద్దలు ప్రతిపాదించారట! ఈ లెక్కన టీడీపీకి మిగిలే అసెంబ్లీ స్థానాలు వందే అన్నమాట! టీడీపీ వంతుగా లోక్‌సభ స్థానాలు కూడా 13 వస్తున్నాయి. ఈ సర్దుబాటు టీడీపీ క్యాడర్‌కు ఏమాత్రం రుచించడం లేదు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడమన్నది ఓ రకంగా సాహసమే! ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌(AP) వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓట్లను వదిలేసుకోవాల్సి వస్తుంది. బీజేపీపై ముస్లింలు ఆగ్రహంతో ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. బీజేపీ అడుగుతున్నది కూడా తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాలనే! కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్‌తో పాటు, లోక్‌సభ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కైకలూరు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు మకు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోందట! అసలు బీజేపీ ప్లాన్‌ ఏమిటో తెలియక టీడీపీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఓడించడానికే అయితే టీడీపీ కంచుకోటలను ఎందుకు అడుగుతున్నట్టు? కొంపదీసి టీడీపీని బలహీనపరిచే కార్యక్రమంకాదు కదా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. బీజేపీ పెద్దల ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకారం చెబుతారా? లేకపోతే జనసేనతో పొత్తు చాలనుకుంటారా? చూడాలి!

Updated On 12 Feb 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story