టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు శ‌నివారం స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) లు శ‌నివారం స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh), జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. 12 అంశాలతో టీడీపీ(TDP)-జనసేన(Janasena) ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ఇప్పటికే 'సూపర్ సిక్స్' పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించగా.. తాజాగా జనసేన 'షణ్ముఖ వ్యూహం'తో మరో ఆరు అంశాలను వాటికి జోడించింది. ఈ నెలలోనే ఈ ఉమ్మడి మేనిఫెస్టో(Joint Manifesto)ను విడుదల చేయనున్నట్లు స‌మాచారం. పొత్తులో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Updated On 13 Jan 2024 10:37 PM GMT
Yagnik

Yagnik

Next Story