టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బుధవారం సాయంత్రం తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 7.45 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8.50 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి 8 మధ్య శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకోనున్నారు.

బుధవారం ఉదయం 11.27 గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగవ సారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి, 2014-19 వరకు మూడోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

Updated On 11 Jun 2024 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story