టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు, అచ్చెన్నాయుడు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. టీడీపీ 25 సీట్లు ఇస్తామని చెబుతుండగా, మరిన్ని సీట్లు కావాలని జనసేన అధినాయకత్వం కోరుతున్నట్టు సమాచారం. త్వరలోనే రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కివస్తాయని ఇరు పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. రాజానగరం, రాజోలు స్థానాల్లో […]

టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు, అచ్చెన్నాయుడు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. టీడీపీ 25 సీట్లు ఇస్తామని చెబుతుండగా, మరిన్ని సీట్లు కావాలని జనసేన అధినాయకత్వం కోరుతున్నట్టు సమాచారం. త్వరలోనే రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కివస్తాయని ఇరు పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వరుసగా జరుగుతున్న సమావేశాల్లో దాదాపు సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలు కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. సీట్లసర్దుబాటును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముండడంతో టీడీపీ, జనసేన పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావాహులంతా తమ జర్నీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

Updated On 4 Feb 2024 4:54 AM GMT
Yagnik

Yagnik

Next Story