Chandrababu: అమిత్ షా తో ముగిసిన చంద్రబాబు భేటీ
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో రాత్రి 7.30 గంటలకు చంద్రబాబు సమావేశమవుతారని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఏన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీనీ ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్టు భావిస్తున్నారు. చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు డిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కె. రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్టరాజు స్వాగతం పలికారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో రాత్రి 7.30 గంటలకు చంద్రబాబు సమావేశమవుతారని చెప్పినా.. అయితే, రాత్రి వరకూ పార్లమెంటు సమావేశాలు జరగడంతో రాత్రి 11.25 గంటలకు బాబు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. 12.15 గంటల వరకూ సమావేశం కొనసాగింది. చంద్రబాబుతో బీజేపీ పెద్దలు ఏమి మాట్లాడారనే విషయం తెలియాల్సి ఉంది.