ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. దర్యాప్తుకు భంగం కలిగేలా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని.. రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామని అంటున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని లుథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని తెలిపారు.

Updated On 16 April 2024 5:48 AM GMT
Yagnik

Yagnik

Next Story