Chandrababu Naidu: కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడు
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశానికి
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశానికి కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకుగాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తుచేశారు.