Chandrababu : చంద్రబాబు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారట!
తెలంగాణ(Telangana)లో పదేళ్ల బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) అధికారానికి ప్రజలు చరమగీతం పాడారు. కేసీఆర్(KCR) ధోరణి నచ్చక కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఓటేసి గెలిపించారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కోవడం లేదు.
తెలంగాణ(Telangana)లో పదేళ్ల బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) అధికారానికి ప్రజలు చరమగీతం పాడారు. కేసీఆర్(KCR) ధోరణి నచ్చక కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఓటేసి గెలిపించారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కోవడం లేదు. తమ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత పేరుకుపోయి ఉండిందనీ, పర్యావసానంగానే తమను ప్రజలు తిరస్కరించారని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్ల మాత్రమే ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని చెబుతూ వస్తున్నది. కాంగ్రెస్‌తో సరిసమానంగా బీఆర్‌ఎస్ కూడా హామీలు ఇచ్చింది. మరి జనం వాటిని ఎందుకు నమ్మలేదో బీఆర్‌ఎస్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలు ఏమైనప్పటికీ చాలా మంది ఆరు గ్యారంటీల వల్లనేనని అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆరు గ్యారంటీల ప్రభావం పడింది. పథకాలను కాపీ కొట్టడంలో సిద్ధహస్తులైన చంద్రబాబునాయుడు అప్పుడే హామీలు గుప్పిస్తున్నారు. ఇంతకు ముందే కొన్ని వాగ్దానాలు చేసిన చంద్రబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అంతేనా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. తెలంగాణలో రైతుబంధు తరహాలోనే అన్నదాత కార్యక్రమం ద్వారా రైతుకు ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు. 18 ఏళ్లు దాటిని ప్రతి ఆడబిడ్డకు నెలకు 15 వందల రూపాయలు, తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పేదవారికి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. ఇంకా చాలా చాలా చెప్పారు. ఇవన్నీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నవే! తెలంగాణలో కూడా ఈ పథకాలు ఉన్నాయి. అది అలా ఉంచితే, జగన్ సంక్షేమ పథకాలపై రోజుకో విమర్శ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే బాటలో పయనిస్తుండటమే విచిత్రం! ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాల్లా ప్రజలకు పంచిపెడుతున్నారని విమర్శలు చేసే ఓ వర్గం మీడియా చంద్రబాబు హామీలపై మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు.