తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ సమవేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షాను భేటీ అయ్యారు. బాబు తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన(Dlhi Tour)లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amitshah)తో భేటీ సమవేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షాను భేటీ అయ్యారు. బాబు తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారని టీడీపీ(TDP) వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి దగ్గరవ్వాలని టీడీపీ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాకుండా చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌(Azadi Ka Amrit Mahotsav) సమయంలో ప్రధాని మోదీ(PM Modi)తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. జీ20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధానితో సమావేశమయ్యారు. ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశాభివృద్ధి కోసం అవసమైతే మోదీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధమని కూడా చంద్రబాబు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీలో దిగిన చంద్రబాబును నర్సాపురానికి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు(Raguramakrishnam Raju) కలుసుకున్నారు. ఆయనను సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి(Rammohan Naidu)తో కలిసి రఘురామ విమానాశ్రయానికి వెళ్లారు.టీడీపీకే చెందిన గుంటూరు, విజయవాడ లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్(Galla Jayadev), కేశినేని నాని(Kesinani Nani) వారి వెంట లేరు.

Updated On 3 Jun 2023 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story