తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నోటి వెంట రెండు వాక్యాలు పదే పదే వస్తుంటాయి. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని, సెల్‌ఫోన్‌ను(cellphone) నేనే కనిపెట్టానని అంటూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకుంటుంటారు. ఈ రెండూ హాస్యాస్పదాలే అన్న సంగతి ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి తెలియదు. ఆయనను మోసే మీడియా కూడా ఈ విషయం ఆయనకు చెప్పదు.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) నోటి వెంట రెండు వాక్యాలు పదే పదే వస్తుంటాయి. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని, సెల్‌ఫోన్‌ను(cellphone) నేనే కనిపెట్టానని అంటూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకుంటుంటారు. ఈ రెండూ హాస్యాస్పదాలే అన్న సంగతి ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి తెలియదు. ఆయనను మోసే మీడియా కూడా ఈ విషయం ఆయనకు చెప్పదు. దేశంలో టెలికమ్యూనికేషన్‌లో(Telecommunication) విప్లవం తీసుకొచ్చింది నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi). రాజీవ్‌గాంధీ ఆదేశాల మేరకు సామ్‌ పిట్రోడా ఈ రంగంపై ఎంతో కృషి చేశారు. పీవీ నరసింహారావు హయాంలో టెలికమ్యూనికేషన్స్‌ రంగం ఊపందుకుంది. ఆ సమయంలోనే టెలిఫోన్లు విస్తృతమయ్యాయి. 1995లో దేశంలో మొట్టమొదటి సెల్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. జులై 31న అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో కేంద్ర మంత్రి సుఖ్‌రామ్‌(Sukh Ram) సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. అప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా కాదు. సరే.. ఈ గోల ఎప్పుడూ ఉండేదే కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకా మొబైల్‌ ఫోన్లను బాగా ప్రమోట్‌ చేశారు. పార్టీ శ్రేణులకు కూడా సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఆయన కూడా సెల్‌ఫోన్‌ను విపరీతంగా వాడారు. ఆ మాటకొస్తే ల్యాప్‌ట్యాపో, సెల్‌ఫోనో దగ్గర లేకపోతే చంద్రబాబు ఉండలేరు. గాడ్జెట్స్‌(Gadgets) అంటే అంత అభిమానం చంద్రబాబుకు! అలాంటిది దాదాపు 40 గంటలుగా సెల్‌ఫోన్‌ లేకుండా సెల్‌లో ఉంటున్నారు చంద్రబాబు! పాతికేళ్లకు పైగా ఎప్పుడూ సెల్‌ఫోన్‌తో గడిపిన చంద్రబాబుకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ అనుకోలేదు.

Updated On 14 Sep 2023 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story