Chandrababu Health Bulletin : చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది
రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
రాజమండ్రి జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు(Chandrababu) అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే.. చంద్రబాబు ప్రస్తుతం చర్మ(Skin) సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు జైలు సూపరింటెండెంట్ చంద్రబాబు నాయుడు హెల్త్ బులిటెన్(Health Bulletin) విడుదల చేశారు. జైలులోని వైద్యులకు చంద్రబాబు తన చర్మ సమస్యను చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి(Govt Hospital) నుంచి ఇద్దరు వైద్యులు వచ్చి చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు. ఎటువంటి భయాందోళన, అపోహలకు గురికావద్దని జైలు అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.