FiberNet Scam Case : రేపు సుప్రీంలో చంద్రబాబు పైబర్ నెట్ కేసు విచారణ
రేపు సుప్రీంలో చంద్రబాబు నాయుడు పైబర్ నెట్ కేసు విచారణ జరుగనుంది.

Chandrababu Fibernet case will be heard in the Supreme Court tomorrow
రేపు సుప్రీం(Supreme Court)లో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పైబర్ నెట్ కేసు(FiberNet Scam Case) విచారణ జరుగనుంది. పైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్(Bail) కోసం పిటీషన్ దాఖలు చేయగా.. హైకోర్టు(High Court) నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంలో సవాలు చేశారు. చంద్రబాబు పిటీషన్ ను జస్టిస్ అనిరుద్దబోస్(Justice Aniruddhabos), జస్టిస్ బేలా ఎం త్రివేదీ(Justice Bela M Trivedi)లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించనుంది.
అంతకుముందు 17 ఏ పై స్పష్టత వచ్చిన తరువాత పైబర్ నెట్ కేసును విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 17 ఏ పై నేడు సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 17 ఏ పై కోర్టు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా.? లేదా.? అన్న దానిపై న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై దాఖలు చేసిన ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
