Chandrababu : పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు
కూటమి కట్టిన తర్వాత మూడు పార్టీలు కలిసి పని చేయాలి! అది పొత్తు ధర్మం. అధికారమే పరమావధిగా టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీలు(BJP) పొత్తు పెట్టుకున్నాయి. ఒంటరిగా వెళితే జగన్‌ను(Jagan) ఓడించడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు(Chandrababu) మొదట పవన్‌తో(Pawan kalyan) చేతులు కలిపారు. ఆ బలం కూడా సరిపోదని అనుకున్నాక బీజేపీని బతిమాలి బామాలి కూటమిలోకి వచ్చేలా చేశారు.
కూటమి కట్టిన తర్వాత మూడు పార్టీలు కలిసి పని చేయాలి! అది పొత్తు ధర్మం. అధికారమే పరమావధిగా టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీలు(BJP) పొత్తు పెట్టుకున్నాయి. ఒంటరిగా వెళితే జగన్‌ను(Jagan) ఓడించడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు(Chandrababu) మొదట పవన్‌తో(Pawan kalyan) చేతులు కలిపారు. ఆ బలం కూడా సరిపోదని అనుకున్నాక బీజేపీని బతిమాలి బామాలి కూటమిలోకి వచ్చేలా చేశారు. కేసులకు భయపడే బీజేపీని శరణుచొచ్చారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు! అయినా చంద్రబాబు మాత్రం తన ప్రసంగాలలో బీజేపీనే పొత్తుకోసం తన దగ్గరకు వచ్చిందని డాంబికాలు పలుకుతుంటారు. అనివార్యంగా పొత్తు పెట్టుకున్నారు కానీ చంద్రబాబుకు జనసేన, బీజేపీ మీద ప్రేమాభిమానులు ఉన్నాయని అనుకోలేం. పొత్తులు పెట్టుకోవడం, పొత్తు ధర్మాన్ని పాటించకపోవడం చంద్రబాబుకు అలవాటే! ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు. సభలలో ఎక్కడా తన మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదు. రోడ్ షోలలో కూడా అదే పరిస్థితి. అంతా తన చేతుల మీదుగానే సాగాలన్నది చంద్రబాబు భావన. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ, జనసేనలకు చెప్పుకోదగ్గ నేతలే ఉన్నారు. అయితే వారికి చంద్రబాబు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రసంగాలలో ఎక్కడా మిత్రపక్షాల పేర్లు చెప్పలేదు. కూటమి పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని మాత్రం చంద్రబాబు పదే పదే చెప్పారు.