టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలంగాణ ఎన్నికల ఫలితాల(Telangana Election Results)పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. ఏపీ(AP)లో కూడా జగన్‌ ప్రభుత్వం(Jagan Govt) అహంకారంతో ఉందని వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలంగాణ ఎన్నికల ఫలితాల(Telangana Election Results)పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. ఏపీ(AP)లో కూడా జగన్‌ ప్రభుత్వం(Jagan Govt) అహంకారంతో ఉందని వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని అన్నారు. 45ఏళ్లుగా ఒక్క తప్పు కూడా చేయలేదు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించకూడదా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైల్లో పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

తపాను రావడంతో రైతులకు భారీ నష్టం వచ్చిందన్నారు. పంట చేతికొచ్చే వేళ తుపాను వచ్చి నష్టం మిగిల్చిందన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదన్నారు. అందువల్లే అధిక నష్టం జరిగిందన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల పొలాల్లోకి మురికి నీళ్లు వెళ్తున్నాయని.. రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని ఆరోపించారు. తుపాను వల్ల ఎకరాకు రైతులు రూ. 50వేలు నష్టపోయారు. రైతులకు ఈ ప్రభుత్వం ఏవైనా ఇన్‌పుట్స్‌ ఇచ్చిందా.? అని ప్ర‌శ్నించారు. మనకు జరిగిన అన్యాయం కోసం పోరాడదామ‌న్నారు. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించే బాధ్యత నాది.. వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వక పోతే 3 నెలల తర్వాత నేనే ఇస్తానని భ‌రోసా ఇచ్చారు. కౌలు రైతులకు సైతం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు.

Updated On 8 Dec 2023 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story