Chandrababu : ఇంటర్‌లో 'ఇంజినీరింగ్' చేయాలంటే.. చంద్రబాబు 'విజన్' వ్యాఖ్యలు వైరల్
గతంలో టీడీపీ నేత జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన 'భీ.కామ్ లో ఫిజిక్స్' వ్యాఖ్యలు ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అటువంటి వ్యాఖ్యలే ఆ పార్టీ అధినేత కూడా చేశారు. ఇంటర్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి అంటూ
గతంలో టీడీపీ నేత(TDP Leader) జలీల్ ఖాన్(Jaleel Khan) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన 'భీ.కామ్ లో ఫిజిక్స్' వ్యాఖ్యలు ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అటువంటి వ్యాఖ్యలే ఆ పార్టీ అధినేత కూడా చేశారు. ఇంటర్(Inter)లో ఇంజినీరింగ్(Engineering) చేయాలంటే బైపీసీ(BiPC) చేయాలి అంటూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నం(Vishakapatnam)లో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజన్ గురించి మాట్లాడుతూ.. పిల్లలు ఇంజినీరింగ్ చేయాలనుకోవటం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల.. ఆ కలనే విజన్ అంటారని చంద్రబాబు వివరించారు. ఆ విజన్ ను నెరవేర్చుకునేందుకు పిల్లలను చిన్నప్పటి నుంచే ఏ స్కూల్‌లో వేయాలి.. ఇంటర్ ఎక్కడ చేయాలి.. ఇంటర్మీయట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని వ్యాఖ్యానించారు.
ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి - చంద్రబాబు నాయుడు pic.twitter.com/cHt1so9OOC
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2023
అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఇండియా విజన్ 2047 ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు చాలా విషయాలను ప్రస్తావించారు. ఆయన చెప్పిన ఆ విషయాలను పట్టించుకోకుండా ప్రస్తుతం బైపీసీ-ఇంజినీరింగ్ అంటూ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ వన్ అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. ఇందుకోసం చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం పలు వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.