తెలుగుదేశంపార్టీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu) తనకు తాను గొప్ప నేతగా చెప్పుకుంటుంటారు. పార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ డబ్బాలు కొట్టుకుంటారు. తనంతటి సంస్కారవంతుడు రాజకీయాల్లోనే లేరని, ట్రిపుల్‌ ఎక్స్‌ సోపు కంటే తానే గొప్ప అని సోపేసుకుంటుంటారు. ఏడు పదుల వయసులో గెలుపు కోసం నానా కష్టాలు పడుతున్నారాయన! ఈ విజయం ఆయనకు జీవన్మరణ సమస్య. అందుకే నానా పాట్లు పడుతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈసీ చెప్పినా పట్టించుకోకుండా అసత్యాలు చెబుతున్నారు.

అది కూడా వర్క్‌ అవుట్‌ కాకపోవడంతో ఫస్ట్రేషన్‌ వచ్చేసిందా పెద్ద మనిషికి! ఓటమి భయం ఆయనలో ఆవరించింది. తీవ్ర అసహనంలో పడ్డారు. విచక్షణ కోల్పోతున్నారు. బూతులు ఆయన నోట్లోంచి వస్తున్నాయి. ఇంతకు ముందే జగన్‌ను(CM Jagan) కొట్టండి, చంపండి, నరకండి అని చెప్పి తన స్థాయిని తగ్గించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరింతగా దిగజారారు. తిట్ల పురాణాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబం, అమ్మమ్మలు, తాతయ్యలను వదల్లేదు. జగన్‌ను తిట్టడం తప్పించి ప్రచారంలో ఆయనకు చెప్పుకునే అంశమే దొరకడం లేదు.

తెలంగాణలో(Telangana) కేసీఆర్‌(KCR) ఏదో అంటే చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం(Election Commission) చంద్రబాబు మాటలను మాత్రం వినీ విననట్టుగా వ్యవహరిస్తోంది. అనకాపల్లిలో(Ankapalle) జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబేనా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra modi) సభలో ఉన్నంత వరకు హుందాగానే ఉన్నారు. ఆయన వెళ్లిపోగానే రెచ్చిపోయారు.

మైక్‌ చేతికి దొరకగానే పూనకం వచ్చినట్టు తెగ ఊగిపోయారు. ముఖ్యమంత్రి జగన్‌, ఆయన కుటుంబసభ్యులను తిట్టిపోశారు. జగనన్న భూ హక్కు అట. నీ తల్లి మొగుడిచ్చాడా. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? అంటూ దారుణంగా మాట్లాడారు. సభకు వచ్చిన మహిళలు చంద్రబాబు మాటలు వినలేక చెవులు మూసుకున్నారు. చంద్రబాబు ఇంతగా దిగజారడం ఎప్పుడూ చూడలేదని సభకు వచ్చిన జనం అనుకుంటున్నారు. మొత్తంగా చంద్రబాబు మొహంలో పరాజయం తాలూకు ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

Updated On 7 May 2024 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story