Chandrababu : గెలిచేది టీడీపీ-జనసేన కూటమే.. జగన్‌కు అభ్యర్థులు దొరకడం లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అన్నమయ్య జిల్లా పీలేరులో 'రా కదలిరా' సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ..
టీడీపీ((TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) శనివారం అన్నమయ్య జిల్లా పీలేరు(Pileru)లో 'రా కదలిరా' సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాకోర్టులో జగన్(Jagan) కు శిక్ష పడే సమయం సమీపించిందన్నారు. వైసీపీ(YCP)కి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందని.. జగన్‌కు అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని అభివర్ణించారు. ఆ యుద్ధంలో గెలిచేది టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమేనన్నారు.
అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్ డీ(PHD) చేశారని విమర్శించారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన విధానమని ఆరోపించారు. భీమిలిలో సీఎం జగన్ 'సిద్ధం' సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్యపాన నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్.. అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసినంతా జగన్ పై చూపించాలని పిలుపునిచ్చారు. వై నాట్ పులివెందుల(Why Not Pulivendula)? అంటూ చంద్రబాబు శ్రేణులను ఉత్సాహపరిచారు.