ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జగన్‌ ప్రభుత్వంపై(CM jagan) నిందలేస్తూ అరచి గావుకేకలు పెట్టే బ్యాచ్‌ ఇప్పుడు సడి చప్పుడు లేకుండా గమ్మున ఉండిపోయింది. వారు అనుకున్నదొక్కటి.. అయ్యింది మాత్రం ఇంకోటి! విశాఖ పోర్టులో డ్రగ్స్‌ కంటైనర్‌(Drugs container) దొరికిందని తెలియగానే టీడీపీ(TDP) అనుకూల మీడియా, పసుపురంగు పులుముకున్న సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బురదజల్లడానికి రెడీ అయ్యింది. ' ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రాజధానిగా మార్చేసింది.

ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జగన్‌ ప్రభుత్వంపై(CM jagan) నిందలేస్తూ అరచి గావుకేకలు పెట్టే బ్యాచ్‌ ఇప్పుడు సడి చప్పుడు లేకుండా గమ్మున ఉండిపోయింది. వారు అనుకున్నదొక్కటి.. అయ్యింది మాత్రం ఇంకోటి! విశాఖ పోర్టులో డ్రగ్స్‌ కంటైనర్‌(Drugs container) దొరికిందని తెలియగానే టీడీపీ(TDP) అనుకూల మీడియా, పసుపురంగు పులుముకున్న సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బురదజల్లడానికి రెడీ అయ్యింది. ' ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రాజధానిగా మార్చేసింది. డ్రగ్స్‌ స్వాధీనంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికారపార్టీ హస్తం ఉండవచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ రాష్ట్రానికి రావడంపట్ల సమగ్ర విచారణ జరగాలి' ఈ మాటలన్నది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu). 'ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాత్రం మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చింది. ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌ దొరకడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో డ్రగ్స్‌ మాఫియాను కట్టడి చేయాలి' ఈ హితోక్తులు చెప్పింది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan). ఇన్నేసి మాటలన్న చంద్రబాబు- పవన్‌కల్యాణ్‌ను ఇప్పుడు గప్‌చుప్‌! ఎందుకంటే ఆ కంటైనర్‌ తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిందని, స్మగ్లింగ్‌ దందా వెనుక ఉన్నది టీడీపీ నేతలేనని విచారణలో తేలడంతో నోళ్లు కుట్టేసుకున్నారిద్దరు! మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ వ్యవహారంలో నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తుండటంతో ఇప్పుడేమిటి చేయడమా అని తలలు పట్టుకుంటున్నారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు, ఆయా కుటుంబాలకు ఉన్న సంబంధాలు ఇప్పడిప్పుడే బయటపడుతున్నాయి.

మరీ ముఖ్యంగా పురంధేశ్వరి(Purandeswari) కుమారుడు, సమీపబంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటయ్యిందని స్పష్టమయ్యింది. లోకేశ్‌(Lokesh) తోడల్లుడు గీతం యూనివర్సిటీ అధినేత భరత్‌ కుటుంబంతోనూ వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలుతో కోటయ్య చౌదరికి చక్కటి సాన్నిహిత్యం ఉందని తేలింది. అసలే ఎన్నికల వేళ. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేసి, అనుకూల మీడియాలో పేజీల కొద్దీ కథనాలు రాయించేసి పబ్బం గడుపుకోవాలనుకున్నారు చంద్రబాబు. దర్యాప్తులో ఇలా తమవారి పేర్లు బయటకు వస్తాయని ఆయన అనుకోని ఉండరు. విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కిలోల డ్రగ్స్‌తో తెలుగుదేశం పార్టీ నేతలకు నేరుగా సంబంధాలున్నాయని తెలుస్తోంది. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గరి సంబంధాలున్నాయి.

కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్‌కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశముంది. బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. ఈయనకు టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి ఫ్యామిలీతోనూ సాన్నిహిత్యం ఉంది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్న కాలంలో సంధ్యా ఆక్వా కంపెనీ అనేక అక్రమాలు చేసింది. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న నారా చంద్రబాబునాయుడు అసలు డ్రగ్స్‌ వ్యాపారం ఎక్కువగా జరిగింది తన హయాంలోనే అన్న సంగతి బహుశా ఆయనకు తెలియదు కాబోలు! స్వయంగా ఆయన మంత్రులే ఈ విషయం చెప్పారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు.

మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగు ధ్వంసంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉన్నదని పార్లమెంట్‌కు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిన విషయం బాబు-పవన్‌కు తెలియకపోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2016లో శ్రీలంకలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిందని భారత ప్రభుత్వానికి శ్రీలంక ప్రభుత్వం సమాచారమిచ్చింది. అప్పుడు చంద్రబాబు సైలెంట్‌గా ఉండిపోయారు. దేశం మొత్తానికి గంజాయి సరఫరా విశాఖపట్నం నుంచే జరుగుతుందని అప్పట్లో టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్‌ చేశారు. అప్పుడు గంటా మాటల్లో నిజం లేదని ఒక్కరంటే ఒక్క టీడీపీ నేత కూడా కౌంటర్‌ ఇవ్వలేదు. చంద్రబాబు కూడా మౌనంగా ఉన్నారు. మరో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఇంచుమించు ఇలాంటి కామెంటే చేశారు. గంజాయి అక్రమ రవాణాలో పోలీసులతో పాటు పెద్దల పాత్ర కూడా ఉందని అయ్యన్న పాత్రుడు సెలవిచ్చారు.

Updated On 22 March 2024 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story