Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో(skill Development Case) కోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు మరోమారు చుక్కెదురైంది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు(ACB Court) బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో.. చంద్రబాబు ఏపీ హైకోర్టును(AP High Court) ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో(skill Development Case) కోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు మరోమారు చుక్కెదురైంది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు(ACB Court) బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో.. చంద్రబాబు ఏపీ హైకోర్టును(AP High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆపై కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మూడు రోజుల క్రితం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నేడు మరోమారు విచారణ వాయిదా పడింది.