స్కిల్‌ కేసు(Skill Development Scam Case)లో చంద్రబాబు బెయిల్‌(Chandrababu Bail)పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ప‌డింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు(High Court)లో బుధ‌వారం ఉద‌యం విచారణ జ‌రిగింది.

స్కిల్‌ కేసు(Skill Development Scam Case)లో చంద్రబాబు బెయిల్‌(Chandrababu Bail)పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ప‌డింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు(High Court)లో బుధ‌వారం ఉద‌యం విచారణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామంటూ సీఐడీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది.

అంత‌కుముందు ఈ నెల 10వ తేదీన చంద్ర‌బాబు బెయిల్‌ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సీఐడీ తరపు న్యాయవాది వినతి మేరకు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందుబాటులో లేనందున విచార‌ణ‌ను వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. ఈ వినతి మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ గడువు ఉంది. అనంత‌రం ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో లొంగిపోవాల్సివుంటుంది.

Updated On 15 Nov 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story