LV Subramanyam : సీఐడీ దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధం
ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై స్పందించారు. కేసులో సీఐడీ దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం(LV Subramanyam) స్కిల్ డెవలప్ మెంట్ కేసు(Skill Development case)పై స్పందించారు. కేసులో సీఐడీ(CID) దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రతిపాదనకు సంబంధించి మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుపట్టే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉండదని అన్నారు. అమలుతీరులో ఏదైనా తప్పులు జరిగితే.. సంబంధిత అధికారిని మాత్రమే బాధ్యుడిని చేయాల్సి ఉంటుందన్నారు. మంత్రి లేదా ముఖ్యమంత్రిని నిందించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్(Skill Development Scam) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అరెస్ట్ అయ్యారు. సీఐడీ అరెస్టు చేయగా.. ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతూ ఉంది. ఇప్పటికే పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.