టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) ఏపీ హైకోర్టు(AP High Court) ఊరటను కల్పించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner ring road case) కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్(Anticeptary bail) పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) ఏపీ హైకోర్టు(AP High Court) ఊరటను కల్పించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner ring road case) కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్(Anticipotary bail) పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్(Interim) పై ఉన్నారని.. ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న సమయంలో మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి. ఏపీ సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసును తెరపైకి తీసుకువచ్చింది. అలాగే అంగళ్లు కేసు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Updated On 7 Nov 2023 4:37 AM GMT
Ehatv

Ehatv

Next Story