Bhogi celebrations : భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అందరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు.

Chandrababu and Pawan Kalyan participated in Bhogi celebrations
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు(Sankranthi Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అందరూ ఉత్సాహంగా భోగి(Bogi) వేడుకల్లో పాల్గొంటున్నారు. అమరావతి(Amaravathi) సమీపంలో మందడం(Mandhadam)లో జరిగిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. అమరావతి జేఏసీ(Amaravathi JAC), టీడీపీ(TDP), జనసేన(Janasena) ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్‌లకు మందడంలో టీడీపీ, జనసేన కార్యకర్తలతోపాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భోగిమంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం(YCP Govt) తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు.
ఇదిలావుంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇరువురు నేతలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు.
