Chandrababu and Pawan Kalyan : సీఎం జగన్‌కు చంద్రబాబు, పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సీఎం జగన్(CM Jagan)కు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదిక సీఎం జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెష్ చెప్పారు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu and Pawan Kalyan
సీఎం జగన్(CM Jagan)కు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదిక సీఎం జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెష్ చెప్పారు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌కు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు నోట్‌లో రాసుకొచ్చారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలావుంటే.. నిన్న యువగళం-నవశకం సభలో చంద్రబాబు, పవన్ లు సీఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ రాజకీయ పార్టీకాదని, జగన్ రాజకీయాలకు అనర్హుడన్నారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుందన్నారు. జగన్ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. దేశంలో ఎక్కడా జరగని ఘటనలు ఏపీలో జరుగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలన్నారు.
పవన్ మాట్లాడుతూ.. తన ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని ముఖ్యమంత్రి మనకెందుకు అని సభకు హాజరైన శ్రేణులను ప్రశ్నించారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్పు తీసుకొస్తాం - వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్ అన్నారు.
