Nara Rohit Engagement : నారా రోహిత్-సిరిలెల్ల నిశ్చితార్థానికి చంద్రబాబు దంపతులు
నటుడు నారా రోహిత్(Nara Rohith)-సిరిలెల్ల(Sirilella) ఎంగేజ్‌మెంట్(Engagement) ఘనంగా జరిగింది.
నటుడు నారా రోహిత్(Nara Rohith)-సిరిశ లెల్ల(sirisha) ఎంగేజ్‌మెంట్(Engagement) ఘనంగా జరిగింది. ప్రతినిధి 2లో తన సరసన నటించిన హీరోయిన్‌నే రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆదవారం ఉయంద జరిగిన నిశ్చితార్థం వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి, సిరిలెల్ల కుటుంబసభ్యులతో పాటు రెండు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు. నిశ్చితార్థం తర్వాత నారా రోహిత్, సిరిలెల్లకు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం రోహిత్, సిరిలెల్ల ఎంగేజ్‌మెంట్‌కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు(Chandrababu) తమ్ముడు నారా రామ్మూర్తి కుమారుడే నారా రోహిత్. ఈయన బాణం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన సోలోతో తొలి విజయాన్ని అందుకున్నారు నారా రోహిత్. ఆ తర్వాత సారొచ్చారు’, ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’(Prathinidhi), ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి సినిమాల్లో నటించారు. 2018లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నటి సిరితో రోహిత్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.