అంగళ్లు కేసులో(Angallu Case) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై(Anticitary Bail Petition) గురువారం ఏపీ హైకోర్టులో(AP High Court) విచారణ జరిగింది. ఇరువైపులా వాద‌న‌లు విన్న ధర్మాసనం..

అంగళ్లు కేసులో(Angallu Case) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై(Anticitary Bail Petition) గురువారం ఏపీ హైకోర్టులో(AP High Court) విచారణ జరిగింది. ఇరువైపులా వాద‌న‌లు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఆగస్టు 4న చంద్రబాబు 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై చంద్రబాబు సహా టీడీపీకి చెందిన మొత్తం 179 మందిపై ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబుని ఏ1గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారికి ముందస్తు బెయిల్ దొరికింది.

Updated On 12 Oct 2023 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story