TDP - Janasena First List : నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటించే ఛాన్స్.!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ అభ్యర్ధుల ప్రకటనలో అధిష్టానం ముందుండగా.. టీడీపీ-జనసేన కూటమి మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ అభ్యర్ధుల ప్రకటనలో అధిష్టానం ముందుండగా.. టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇటీవల పవన్(Pawan), చంద్రబాబు(Chandrababu)ల సుదీర్ఘ చర్చల అనంతరం.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఆ జాబితాను నేడు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో ఇరు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ జాబితాలో 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు సమాచారమిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు, యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారనేది వార్తల సారాంశం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉదయం 9 గంటల వరకల్లా పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కూడా కొనసాగుతున్నన్నాయి. పొత్తులనూ ఏకాభిప్రాయానికి రాకుండానే అభ్యర్ధుల ప్రకటన ఎలా చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది.