డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ ఇస్తూ.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెట్టేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఈ మేర‌కు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు.

డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్ ఇస్తూ.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెట్టేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఈ మేర‌కు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేయ‌డంతో సీఈవో మీనా ఈ మేర‌కు చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని సీఈవో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధమ‌న్నారు. ఫామ్‌ -6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలని.. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

Updated On 8 Dec 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story