Nirmala Sitharaman : నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991 కోట్లు
ఆంధ్రప్రదేశ్ (andhra Pradesh)అప్పులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఆమె అప్పుల(Loans) వివరాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు(FRBM) లోబడే ఉందని ఆమె తెలిపారు. ఏపీ ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ (andhra Pradesh)అప్పులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఆమె అప్పుల(Loans) వివరాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు(FRBM) లోబడే ఉందని ఆమె తెలిపారు. ఏపీ ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అప్పులపై లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తుందని, ఫైనాన్స్ కమిషన్ సిఫారుసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని ఆర్ధిక మంత్రి వివరించారు. '2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు. 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.