నాగార్జున సాగర్‌ జలాల విడుద‌ల‌ విష‌య‌మై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొంది. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తుంది.

నాగార్జున సాగర్‌ జలాల(Nagarjuna Sagar Dam) విడుద‌ల‌ విష‌య‌మై ఏపీ(AP), తెలంగాణ(Telangana) మధ్య వివాదం నెలకొంది. దీనిపై కేంద్ర హోం శాఖ(Home Affairs Department) స్పందించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా(Ajay Kumar Bhalla) వ‌ర్చువ‌ల్‌గా స‌మీక్ష‌ నిర్వహించారు.

సాగర్‌ జలాల విడుదల విషయంలో నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ.. డ్యామ్‌ నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్‌ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో సీఆర్పీఎఫ్‌ దళాలు డ్యామ్ వ‌ద్ద ప‌హారా కాయ‌నున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections) జ‌రుగుతుండ‌గా.. నవంబరు 29వ తేదీ రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500మంది సాయుధ పోలీసులు సాగర్‌ డ్యామ్‌పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు.. 5, 7 నంబరు గేట్లు తెరిచి దాదాపు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వన చర్య రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించింది. ఈ చర్య వ‌ల్ల‌ హైదరాబాద్‌(Hyderabad) నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలిగే అవ‌కాశం ఉంది. దీంతో 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్‌ కోని కొనసాగించాలని సీఎస్‌ శాంతి కుమారి(Shanthi Kumari) కేంద్ర హోంశాఖను కోరారు.

Updated On 1 Dec 2023 9:34 PM GMT
Yagnik

Yagnik

Next Story