Chelluboyina Srinivasa Venugopalakrishna : డిసెంబర్ 9 నుండి ఏపీలో కులగణన
డిసెంబర్ 9 నుండి ఏపీలో కులగణన ప్రక్రియ మొదలవుతుందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..
డిసెంబర్ 9 నుండి ఏపీలో కులగణన ప్రక్రియ మొదలవుతుందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ(Chelluboyina Srinivasa Venugopalakrishna) తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి(Thadepalli)లో మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర కులగణన చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రతగా పేర్కొన్నారు. ప్రజల జీవన స్థితి మారడానికి కులగణన అవసరం అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని తెలిపారు.
సామాజిక సాధికారతకు చిరునామా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) అని కొనియాడారు. కులగణన కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలకు కులగణన అంటే వెన్నులో వణుకు పుడుతోందన్నారు.