CM Jagan Name In Viveka Case : వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిల్ లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. అఫిడవిట్ లో ఏపీ సీఎం జగన్ పేరుని చేర్చింది. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6: 15 గంటలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)లో సీబీఐ(CBI) కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలు చేసింది. ఈ అఫిడవిల్ లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. అఫిడవిట్ లో ఏపీ సీఎం జగన్(CM Jagan) పేరుని చేర్చింది. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6: 15 గంటలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి(MV Krishnareddy) హత్య విషయాన్ని బయట పెట్టకముందే.. జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. అయితే ఈ విషయమై దర్యాఫ్తు చేయాల్సి ఉందని చెప్పింది. వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అప్డేట్ వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్న జగన్ న్యాయవాదులు.. దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.